పుదుచ్చేరిలో తమిళంపై సీఎం కీలక ప్రకటన 1 y ago
డీఎంకే పార్టీ, కేంద్రంలోని బీజేపీ మధ్యం భాషా వివాదం నడుస్తోంది. ఈక్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లిష్, ఫ్రెంచ్ అధికారిక భాషలు. తమిళం మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి దుకాణాలు, వ్యాపార సముదాయాలు సైన్ బోర్డులపై పేర్లు తమిళంలో ఉండాల్సిందేనని సీఎం రంగస్వామి ఆదేశించారు. ఈమేరకు సూచనలు చేస్తూ సర్క్యులర్ జారీ చేస్తామని సీఎం వెల్లడించారు.